‘ఖైదీ’ .. మ‌క్కీటు మ‌క్కీ..?

161

మెగాస్టార్ చిరంజీవి 150కి చిత్రం ‘ఖైదీ నంబ‌ర్ 150’. ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక శ‌నివారం రాత్రి గుంటూరు వేదిక‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్‌, ద‌ర్శ‌కుడు ఏ.ఆర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘క‌త్తి’ని చిరంజీవి క‌థానాయ‌కుడుగా వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఖైదీ నంబ‌ర్ 150’గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

అయితే, సినిమా మొత్తాన్ని దించేయ‌కుండా కొన్ని మార్పులు చేర్పులు చేసిన‌ట్టు చెప్పారు సినిమాద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ, ఈ చిత్ర ట్రైల‌ర్‌ను చూస్తే మాత్రం త‌మిళ్ ఒరిజిన‌ల్ సినిమా ‘క‌త్తి’ ట్రైల‌ర్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలాగే ‘ఖైదీ నంబ‌ర్ 150’ ట్రైల‌ర్ ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. సినిమాలో మార్పులు చేర్పుల‌న్న‌ది విడుద‌ల‌య్యాక తెలుస్తుందేమో కానీ.. ట్రైల‌ర్ విష‌యంలో మాత్రం మ‌క్కీటు మ‌క్కీ దించేశారంటూ ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. రీమేక్ సినిమా కాబ‌ట్టి చిత్రం మొత్తం అలాగే ఉన్నా ఏం ఫ‌ర్వాలేదు కానీ.. ట్రైల‌ర్‌ను కూడా అలా దించేయ‌డ‌మేంట‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.