క్రిష్ ని చూస్తే అసూయగా ఉందట..

111

నంద‌మూరి బాల‌కృష్ణ, క్రిష్ జాగ‌ర్ల‌మూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’. ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుంది. అయితే, అంద‌రిపైనా ట్వీట్ల విమ‌ర్శ‌లు గుప్పించిన వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఇప్పుడు.. ‘గౌత‌మిపుత్ర’ ద‌ర్శ‌కుడు క్రిష్‌ను వ‌దిలిపెట్ట‌లేదు. తాజాగా ఆయ‌న క్రిష్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.

ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ ముంబైలో ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’ సినిమా చూసింద‌ని, జాతీయ‌, అంత‌ర్జాతీయ హ‌క్కులు కొంటోంద‌ని చెప్పిన‌ వ‌ర్మ..త‌ర్వాత ట్వీట్‌ల‌ను కొన‌సాగించాడు. ముంబైలో ‘గౌత‌మిపుత్ర శాతక‌ర్ణి’ సింగిల్ షోతో క్రిష్ నాలుగు కంపెనీల‌తో సంత‌కం చేశారని వెల్ల‌డించ‌డ‌మే కాక‌.. హే క్రిష్‌ నిన్ను చూస్తే నాకు అసూయ‌గా ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఈ నాలుగు కంపెనీల్లో ఒక‌టి ఏకే అని నాకు తెలుసు. రెండోది ఎస్‌కే అని విన్నాను. క‌న్‌ఫ‌ర్మ్ చేయ‌వా అంటూ ట్వీట్ చేశారు.