హ‌రితేజ‌ను అంత చీప్‌గా చూశాడా?

368

ఒక్క‌రాత్రిలో యావ‌త్ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను త‌న‌వైపు తిప్పుకునే క్ష‌ణాలు అతికొద్దిమందికి మాత్ర‌మే ల‌భిస్తుంటాయి. అలాంటి అదృష్ట‌వంతుల‌లో ఇప్పుడు టీవీ క‌మ్ టాలీవుడ్ న‌టి హ‌రితేజ ఒక్క‌సారిగా చేరిపోయింది. అంత‌వ‌ర‌కు అడ‌పాద‌డ‌పా టీవీల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసుకుంటూ గ‌డిపిన హ‌రితేజ త్రివిక్ర‌మ్ చేతిలో ప‌డిన శిల్పంలా త‌యారై వెలిగిపోతోంది. కార‌ణం ‘అ..ఆ’ సినిమాలో తాను చేసిన ప‌నిమినిషి పాత్ర ఇప్పుడు తెలుగు సినీరంగంలో స‌హాయక పాత్ర‌ల విష‌యంలో స్టార్ గిరీని చ‌లాయిస్తున్న న‌టి ఎవ‌రంటే ముందు చెప్పాల్సింది హ‌రితేజ‌నే మ‌రి.

నితిన్ కొత్త లుక్స్‌, స‌మంత అద్భుత న‌ట‌నా సౌంద‌ర్యం ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే ‘అ..ఆ’ సినిమా మొత్తంలో పాత్ర‌ల‌కు ప్రాణ ప్ర‌తిష్ట పోసిన‌వారు ముగ్గురు. రావుర‌మేష్‌. హ‌రితేజ‌. అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ వీరిలో రావుర‌మేష్‌, అనుప‌మా ఇప్ప‌టికే చిత్ర‌సీమిలో బాగా గుర్తింపు తెచ్చుకున్నవారు. కాని హ‌రితేజ మ‌టుకు ‘అ..ఆ..’సినిమాతో త‌న గ్రాఫ్‌ను అమాంతంగా పెంచుకుపోయింది. ఇప్ప‌డు అల్లుఅర్జున్ దువ్వాడ జ‌గ‌న్నాధం, సునీల్ చిత్రాల‌లో న‌టిస్తోంది. కాని త‌న గుర్తింపుకు నూటికి నూరు శాతం త్రివివ్ర‌మ్ వ్య‌క్తిత్వ‌మే కార‌ణం అంటూ కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటోంది హ‌రితేజ‌.

ఎందుకంటే త‌న‌వ‌ద్ద ఎవ‌రైనా గాసిప్‌లు, గుస‌గుస‌లు చెప్ప‌డానికి సిద్ధ‌ప‌డితే ఏమాత్రం అనుమ‌తించ‌ని ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్. ఎప్పుడైనా తాను గాసిప్‌లు మాట్లాడ‌టానికి ప్ర‌య‌త‌న్నిస్తే ఆమెకేసి చాలా చీప్‌గా చూసేవాడ‌ట త్రివిక్ర‌మ్‌. పైగా ఇలా టైమ్ వేస్ట్ చేయ‌డానికి బ‌దులుగా ఏద‌యినా చ‌దువుకోరాదా అని మంద‌లించేవాడ‌ట ఆమెను. గాపిస్‌లు త‌న స‌మీపంలోకి కూడా రానీయ‌ని త‌త్వం త్రివిక్ర‌మ్‌ది.

హ‌రితేజ ఒక ద‌ర్శ‌కుడితో క్లోజ్‌గా తిరుగుతోంద‌నే రూమ‌ర్లు వ‌చ్చిన‌ప్పుడు ఆ షాక్ నుంచి తెప్ప‌రిల్ల‌డానికి ఆమెకు మూడునెలల స‌మ‌యం ప‌ట్టింద‌ట‌. పైగా జ‌బ్బుప‌డిన అమ్మమ్మ బాగోగులు చూసుకోవ‌ల‌సిన వ‌చ్చింది. 3 నెల‌ల త‌ర్వాత ఎలాగోలా కోలుకుని తిరిగి వ‌చ్చేస‌రికి ఆమె స‌న్నిహిత మిత్రురాలే అడిగేసింద‌ట‌. ఆ ద‌ర్శ‌కుడిని పెళ్లి చేసుకున్నావా అని. ఈ అనుభ‌వం నేర్పిన పాఠంతో తానిప్పుడు మ‌రింత ప‌రిణ‌తితో వ్య‌హ‌రిస్తున్నాన‌ని హ‌రితేజ చెబుతోంది.