మేమిద్దరం పోటీ పడి నటించాం

102

నేను న‌టించిన రెండు చిత్రాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఒక ప‌క్క ఆనందంగానూ, మ‌రో ప‌క్క భ‌యంగానూ ఉంది అన్నారు జ‌య‌సుధ‌. స‌హ‌జ‌న‌టిగా పేరు తెచ్చుకొన్న ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప‌లు పాత్రల‌కి ప్రాణం పోస్తున్నారు. ఇటీవ‌ల ‘హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌’లో ఆర్‌.నారాయ‌ణ‌మూర్తికి జోడీగా న‌టించారు. ఆ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో జ‌య‌సుధ మాట్లాడారు.

క‌థానాయిక‌గా, న‌టిగా న‌ల‌భై ఐదేశ్లుగా ప్రయాణం చేస్తున్నా, యాభై ఎనిమిదేళ్ల వ‌య‌సులో ఆర్‌. నారాయ‌ణ‌మూర్తిగారితో క‌లిసి ఆయ‌న‌కి జోడీగా తొలిసారి న‌టించా, ఆ రకంగా ‘హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య’ నాకు ప్రత్యేక‌మైన చిత్రం. దానికితోడు నేను కీల‌క పాత్ర పోషించిన ‘శ‌త‌మానం భ‌వ‌తి’ ఈ సంక్రాంతికే విడుద‌ల‌వుతోంది. అందుకే ఈ సినిమాల ఫ‌లితాల పై నేనూ ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నా, పండ‌క్కి విడుద‌లవుతున్నఅన్ని చిత్రాలు బాగా ఆడాలి, మా ‘హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య’ ఇంకాస్త బాగా ఆడాల‌ని కోరుకొంటున్నా.ఈ సినిమా ప్రక‌టించిన‌ప్పట్నుంచి నేను, నారాయ‌ణ‌మూర్తి క‌లిసి తెరపై ఎలా క‌నిపిస్తామో అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

మేమిద్దరం పోటీప‌డి న‌టించాం. ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, శైలిలోనే ఒక మంచి సందేశంతో ఈ చిత్రం తెర‌కెక్కింది. వాణిజ్యాంశాలూ పుష్కలంగా ఉన్నాయి. త‌ప్పకుండా అంద‌రినీ అల‌రించే ఓ మంచి చిత్రమవుతుంది. చిత్ర ద‌ర్శకుడు చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావుతో నాకు మంచి అనుబంధ‌ముంది. ఆయ‌న నిర్మాత‌గా చేసిన ఐదు చిత్రాల్లో నేను న‌టించా. ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌కత్వంలో న‌టించ‌డం ఆనందంగా ఉంది అన్నారు.