కాజ‌ల్‌కు మాత్ర‌మే ద‌క్కిన అరుదైన అదృష్టం..

150

అదృష్టం అంతా కాజ‌ల్ అగ‌ర్వాల్‌దే అన్న‌ది నిక్క‌చ్చిగా నిజం. చిన్న క‌థానాయిక‌గా అడుగుపెట్టిన కాజ‌ల్ అగ‌ర్వాల్ అన‌తి కాలంలోనే పెద్ద స్టార్స్‌తో న‌టించే అవ‌కాశం చేజిక్కించుకుంది. ‘ల‌క్ష్మీక‌ల్యాణం’ సినిమాల‌తో కథానాయికగా తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ కాజల్.. ప‌వ‌న్‌క‌ల్యాణ్ లాంటి అగ్ర కథానాయకుడి స‌ర‌స‌న న‌టించేసింది. తాజాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కూడా ఇన్సిపిరేష‌న్ అయిన మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న కూడా న‌టించేస్తున్న కాజ‌ల్ ఆనందానికి అవ‌ధులు లేవ‌ట‌. చిరంజీవి న‌ట‌న‌కు కామాపెట్టి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి అభిమానులు నిరాశ‌కు గురయ్యారు. అయితే ప‌దేళ్ల సుదీర్ఘ విరామం త‌రువాత చిరంజీవి త‌న 150వ సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌డం జ‌రిగింది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా అవ‌కాశం ఎవ‌రిని వ‌రిస్తుందో అని అంద‌రూ ఎదురుచూశారు.

భారీ సినిమాయే కాకుండా మెగాస్టార్ క్రేజీ సినిమా కావ‌డంతో ఆయ‌న స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం వ‌స్తే రెమ్యున‌రేష‌న్ లేకుండా కూడ‌న‌టించేద్దామ‌నుకునే భామ‌లు లేక‌పోలేదు. అనుకోనివిధంగా ఈ అవ‌కాశం కాజ‌ల్‌కు ద‌క్క‌డంతో సాటి క‌థానాయిక‌లంద‌రికీ ఆశ్చ‌ర్య‌పోవ‌డ‌మే త‌మ వంత‌యింది. అరుదైన  ఈ అవ‌కాశం కాజ‌ల్‌ను వ‌రించ‌డంతో కాజ‌ల్ ఖాతాలో మ‌రో రికార్డు చేరిన‌ట్ట‌యింది. మెగా క‌థానాయిక‌లంద‌రితో చేసిన ఏకైక క‌థానాయిక అనిపించుకుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, అల్లుఅర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవితో స‌హా అంద‌రితో న‌టించిన ఘ‌న‌త వ‌హించిన కాజ‌ల్ అగ‌ర్వాల్ లక్ న‌క్క‌ను తొక్కిన‌ట్ట‌యింద‌నీ ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల భోగ‌ట్టా.