కంట‌త‌డి పెట్టిస్తున్న ‘ఖైదీ’ పాట‌

366

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబ‌ర్ 150’కు సంబంధించి మ‌రో పాట‌ను యూట్యూబ్‌లో బుధ‌వారం విడుద‌ల చేశారు. రైతుల క‌ష్టాలు క‌డ‌గండ్ల నేప‌థ్యంలో చిత్రీక‌రించిన ‘నీరు.. నీరు.. రైతుకంట నీరు చూడ‌నైన చూడ‌రెవ్వ‌రూ..’ అంటూ సాగే ఈ పాట అన్న‌దాత‌ల‌నే కాదు, ప్ర‌తిఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా ఉంది. ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగయ్య‌శాస్ర్తి రాసిన ఈ పాట‌ను శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ ఆల‌పించ‌గా, దేవీశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇంత‌కుముందు విడుద‌ల చేసిన పాట‌ల‌కు, ముఖ్యంగా ‘అమ్మ‌డు.. లెట్స్ డు కుమ్ముడు’ అనే పాట‌కు భారీ స్పంద‌న వ‌చ్చింది. ఆ త‌ర్వాత ‘ర‌త్తాలు’ అనే ఐట‌మ్ సాంగ్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. అయితే, ఆరు ప‌దుల వ‌య‌సులో ‘అమ్మ‌డు లెట్స్‌డు కుమ్ముడు’ అంటూ గంతులేయ‌డం ఏమిటంటూ అనే విమ‌ర్శు వ‌చ్చాయి. ఈ విమ‌ర్శ‌ల‌కు ‘నీరు.. నీరు..’ అనే ఈ తాజా పాట చెక్ పెట్టింది.