అక్కా.. తొక్కా అంటున్న ల‌క్ష్మి మంచు!

187

ల‌క్ష్మిమంచు సాధార‌ణంగా చాలా స‌హ‌నంగా ఉంటుంది. సామాజిక స్పృహ ఎక్కువ‌గా ఉన్న ఈ మంచు వార‌సురాలు.. ఎలాంటి ప‌రిస్థితుల్లోనూమాట జార‌దు. సోష‌ల్ మీడియాలో కూడా చాలా అల‌ర్ట్ గా ట్వీట్స్ రీ ట్వీట్స్ పెడుతూ ఉంటుంది. కానీ ఒక్క‌సారిగా  మంచు ల‌క్ష్మికి కోపం వ‌చ్చేసింది. అక్కా.. తొక్కా అంటూ కాసింత ఘాటుగా రియాక్ట్ అయిపోయింది. అంతేకాదు. త‌న పేరు కూడా మార్చేసుకుందామ‌ని అనుకుంటోంద‌ట‌. ఇంత‌గా మంచు ల‌క్ష్మి ప్ర‌తిస్పందిచ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. ఆ విష‌యం కూడా స్వ‌యంగా తానే చెప్పిందామె.

నేను నా పేరు అక్క అని మార్చేసుకుందామ‌ని సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నా.. క‌నీసంనోటిలో ప‌ళ్లు కూడా లేని ముస‌లాయ‌న న‌న్ను గ‌త వారాంతంలో అక్కా అని పిలిచినప్ప‌టి నుంచి ఇదే ఆలోచిస్తున్నా.. అక్కా.. తొక్కా.. అంటూ ట్వీట్ పెట్టింది మంచు ల‌క్ష్మి. అయినా.. ఏదో సినిమా కోసం అప్పుడ‌ప్పుడు ముస‌లి వేషాలు వేసినంత మాత్రాన‌.. ఆ పెద్దాయ‌న మ‌రీ మంచు ల‌క్ష్మిని అక్కా అంటే.. ఆ మాత్రం కోపం రావ‌డంలో ఆశ్చ‌ర్యం లేదులే. అలాగ‌ని నిజంగా పేరు మార్చేసుకుంటే.. అంద‌రూ అలానే పిల‌వాల్సి వ‌స్తుంది కాబ‌ట్టి.. మార్చుకోవ‌ద్దంటూ ఫ్యాన్స్ తెగ‌ ట్వీట్స్ పెట్టేస్తున్నారు.