కొడుక్కి వార్నింగ్ ఇచ్చిన మోహ‌న్‌బాబు

260

మోహ‌న్‌బాబు ఎంత విల‌క్ష‌ణ న‌టుడో వ్య‌క్తిత్వ ప‌రంగా అంత ఓపెన్ అనే సంగ‌తి తెలిసిందే. అయితే.. అది ఎవ‌రి గురించి మాట్లాడ్డం అయినా..ఏ మాత్రం సంకోచించ‌రు. త‌న బిడ్డ విష్ణు చాలా సిన్సియ‌ర్ అని అంద‌రూ ప్ర‌శంసిస్తుంటే ఆనందంగా ఉంద‌న్న ఆయ‌న.. ఓ విష‌యంలో కొడుకుతో త‌న‌కు క‌లిగిన నిరుత్సాహాన్ని స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చి మ‌రీ చెప్పారు. విష్ణు ఐ వాంట్ టు గివ్ యు వార్నింగ్ ఫ‌ర్ యు.. ఇట్స్ ఏ వార్నింగ్.. ప‌బ్లిక్ చూస్తున్నారు. భార్య‌.. ఇద్ద‌రు బిడ్డ‌లు ఉన్న‌వాడివి.. ఈ మ‌ధ్య‌నే టీవీల్లో చూశాను.

ప‌దిమంది ఎదుట ఉన్న‌ప్పుడు ప‌దిమందిలో నువ్వు చేసిన త‌ప్పు చెప్పాలి. నేను స‌హ‌జంగా నా ఆడియోకి కూడా వెళ్ల‌ను అని ఎక్క‌డో ఫంక్ష‌న్‌లో అన్నావు. అది త‌ప్పు నీ ఆడియో ఫంక్ష‌న్‌కి నువ్వు వెళ్లాలి ప‌దిమంది క‌థానాయ‌కులు నిన్ను ప్రేమ‌గా పిలిచిన‌ప్పుడు వారి ఆడియో ఫంక్ష‌న్‌కి వెళ్లాలి. అంతేకానీ నా ఆడియో ఫంక్ష‌న్ కూడా నేను వెళ్ల‌ను అని కొంత‌మంది క‌థానాయ‌కుల్లాగా డ‌బ్బాలు కొట్టుకోవ‌ద్దు. అర్థ‌మైందా. బీ సిన్సియ‌ర్.. సిన్సియ‌ర్‌గా ఉన్న‌ప్పుడే అన్నీ ఉంటాయ్ మ‌న‌కి.. డ‌బ్బాలు వ‌ద్దు అంటూ కొడుకు విష్ణుకు సున్నితంగానే సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు మోహ‌న్‌బాబు.

‘ల‌క్కున్నోడు’ ఆడియో విడుద‌ల వేడుక‌లో ఈ సంఘ‌ట జ‌రగ‌గా.. సినిమా కోసం ప్ర‌తీ ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డ్డార‌ని అభినందించార‌ని, ముఖ్యంగా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను అభినందిస్తున్నాన‌ని చెప్పారు మోహ‌న్‌బాబు.