600 కోట్ల‌తో మోహ‌న్‌లాల్ మూవీ

62

‘బాహుబ‌లి’ సినిమాకు రూ.250 కోట్ల బ‌డ్జెట్ అంటే ఔరా అనుకున్నాం. ఈ బ‌డ్జెట్లో సినిమా తీస్తే వ‌ర్క‌వుట్ అవుతుందా అని సందేహించారంతా. కానీ ‘బాహుబ‌లి. ది బిగినింగ్’ మాత్ర‌మే
రూ.600కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. మ‌రోవైపు శంక‌ర్ ‘రోబో సీక్వెల్ 2.0’ సినిమాను రూ.400కోట్ల బ‌డ్జెట్తో మొద‌లు పెట్టాడు. దీన ఇగురించి ఆశ్చ‌ర్య‌పోతుంటే త‌మిళ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సుంద‌ర్ ఇంత‌కంటే ఎక్కువ బ‌డ్జెట్లో సినిమా తీయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. మ‌రోవైపు రామ్‌గోపాల్ వ‌ర్మ రూ.340 కోట్ల బ‌డ్జెట్‌తో న్యూక్లియ‌ర్‌ సినిమాను అనౌన్స్ చేశాడు.

మొత్తానికి వంద‌ల కోట్ల బ‌డ్జెట్లో ఇండియ‌న్ సినిమాలు తీయ‌డం మున్ముందు కామ‌న్ అయిపోయేలా ఉంది. ఐతే పైన పేర్కొన్న సినిమాల‌న్నీ ఒకెత్త‌యితే.. మ‌ల‌యాళ స్టార్ మోహ‌న్‌లాల్ సినిమా ఒక ఎత్తు కానుంది. ఎం.టి.వాసుదేవ‌నాయ‌ర్ ర‌చించిన‌రాండ‌మ్ ఓజ్హ‌మ్ అనే న‌వ‌ల ఆధారంగా ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంద‌ట‌. మ‌హాభార‌తంలో భీముని దృక్కోణంలోసాగే క‌థ అది. ఈ చిత్రాన్ని భారీ హంగుల మ‌ధ్య రూ.600కోట్ల బ‌డ్జెట్తో సినిమా అంటే న‌మ్మ‌శ‌స్యంగా లేదు. ఐతే ఈ చిత్రంలో వేరే ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన‌న‌టీన‌టులు కూడా న‌టిస్తార‌ని .. అంత‌ర్జాతీయ సాంకేతిక నిపుణులు ప‌ని చేస్తార‌ని అన్ని ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల్లో ఈ చి్త‌రాన్ని రిలీజ్ చేస్తార‌ని..కాబ‌ట్టి ఈ బ‌డ్జెట్ వ‌య‌బులే అని అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.