డివోషనల్ ‘మన్మధుడు’..!

90

టాలీవుడ్ లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ నాగార్జున. అటు డివోషనల్ మూవీస్ అయినా, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలైనా, చివరికి ‘ఊపిరి’ లాంటి హార్ట్ టచింగ్ సినిమాలైనా నాగ్ అకౌంట్ లో ‘నో’ అన్న పదం లేకుండా సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుంది. అందుకే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తరవాత ఇమ్మీడియట్ గా తెరకెక్కిన ‘ఓం నమో వెంకటేశాయ’ దానికి పర్ ఫెక్ట్ ఉదాహరణ.

ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఒదిగిపోయే నాగ్, ఏ సినిమా చేస్తే ఆ సినిమాలో లీనమై పోతాడు. ‘ఓం నమో వెంకటేశాయ’ ఆడియో రిలీజ్ లో నాగ్ స్పీచ్ వింటే ఆ విషయం ఈజీగా అర్థమైపోతుంది. ఈ సినిమా పూర్తయ్యేసరికి తాను వెంకటేశ్వర స్వామికి మరింత క్లోజ్ అయినట్టనిపించింది ఇమోషనల్ గా చెప్పుకున్నాడు నాగ్. కాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రారావు తెరకెక్కించిన ఓం నమో వెంకటేశాయ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైశ్వాల్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.