అంకుల్ తో స్యామ్‌..!

101

అక్కినేని వారింటి కోడ‌లు అని డిక్లేర్ అయిన త‌రువాత స‌రైన సినిమా సెట్ కాలేదు క‌థానాయిక స‌మంత‌కు. కానీ ఇప్పుడు ఓ సూప‌ర్ ప్రాజెక్టులో పార్ట్ కాబోతోంది. ‘రాజుగారి గ‌ది 2’ సినిమాలో స‌మంత న‌టించ‌బోతోంది. పివిపి సంస్థ ప్రెస్టీజియ‌స్‌గా నిర్మిస్తున్న ఈ సినిమాలో స‌మంత‌తో పాటు మ‌రో ఇద్ద‌రు క‌థానాయిక‌లు కూడా వుంటారు. ‘ర‌న్‌రాజార‌న్’ ఫేం సీర‌త్ క‌పూర్ మ‌రో క‌థానాయిక‌గా ఎంపిక‌యింది.

మూడో క‌థానాయిక ఎంపిక ఇంకా జ‌ర‌గాల్సి ఉంది. ఈ సినిమాలో నాగ్ ఓ డిఫ‌రెంట్క్యారెక్ట‌ర్ పోషిస్తున్నారు. ముగ్గురు కుర్రాళ్ల క్యారెక్ట‌ర్ల‌ను వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్‌, అశ్విన్ పోషిస్తున్నారు. అయితే ముగ్గురు క‌థానాయ‌కులు ఎవ‌రి కోసం? నాగ్  ప‌క్క‌నా? మ‌రేంటీ క‌థ అన్న‌ది ఇంకా తెలియాల్సి వుంది. నాగ్ ప‌క్క‌న స‌మంత వేయడం ఏంటీ సెంటిమెంట్‌గా వుండొచ్చు. అందువ‌ల్ల వేరే డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌నే స‌మంత‌ది కూడా అని అనుకోవాలి. ఏదైనా స‌మంత కూడా ‘రాజుగారి గ‌ది’లోకి రావ‌డం అన్న‌ది ఈ ప్రాజెక్టుకు మ‌రింత క్రేజ్ తీసుకువ‌చ్చింది.