రాజకీయాల్లోకి నమిత..!

92

ద‌ర్శ‌కుడు శ్రీ‌నువైట్ల ‘సొంతం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన న‌మిత‌.. ఆ త‌ర్వాత టాలీవుడ్ కంటే కోలీవుడ్‌లోనే బాగా పాపుల‌ర్ అయ్యింది. ఈమె న‌ట‌న‌తో కాకుండా.. వెండితెరపై త‌న అంద‌చందాల‌ను ఆరబోసి .. సినీ ప్రేక్షుకుల గుండెల్లో స్థానం ద‌క్కించుకుంది.నిజానికి వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైన కొత్త‌ల్లో న‌మిత స‌న్న‌జాజి తీగ‌లా ఉండేది. రానురాను బొద్దుగా మారిప‌వ‌డంతో తెలుగులో ఆఫ‌ర్లు దూర‌మ‌య్యాయి. దాంతో చెన్నైకి మ‌కాం మార్చేసింది. ఈ బొద్దుగుమ్మ‌. బొద్దుగా వుండే క‌థానాయిక‌ల‌ని నెత్తిన పెట్టుకునే త‌మిళ తంబీలు ఈమెకు గుడి క‌ట్టి అభిమానించారు. దీంతో అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ చెన్నైలో సెటిలైపోయింది. అక్క‌డా సినిమాలు త‌గ్గ‌డంతో న‌మిత‌కి మ‌రో త‌ల‌నొప్పి మొద‌లైంది. చెన్నైలో ఇప్ప‌టికీ అద్దె ఇంటిలో వుంటున్న న‌మిత‌కి ఇంటి య‌జ‌మాని నుంచి వేధింపులు మొద‌ల‌య్యాయ‌ట‌.

ఇల్లు ఖాళీ చేయాల‌ని ఆమెని రౌడీల‌తో బెదిరించాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్ర‌యించి, తాత్కాలిక ఉప‌శ‌మ‌నం పొందారు. అయితే, ఈ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ఆమె ఇక పై క్రియాశీల‌క రాజ‌కీయాల్లో ప్ర‌వేశించాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. ఇప్ప‌టికే అన్నాడీఎంకే స‌భ్య‌త్వం క‌లిగిన న‌మిత ఇక ఆ పార్టీ త‌ర‌పున జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు విస్తృతంగా హాజ‌రుకావాల‌ని నిర్ణ‌యించింద‌ట‌. ఈ లెక్క‌న 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బొద్దుగుమ్మ ఆ పార్టీ  త‌ర‌పున ముమ్మ‌రంగా ప్ర‌చారం చేయ‌డం ఖాయంగా తెలుస్తోంది.