ఇలాంటి రూమర్లు కెరీర్ కే ప్రమాదం

102

తనపై వస్తున్న రూమర్లని నమ్మొద్దంటోంది అందాల భామ నందిత రాజ్. ఈ బ్యూటీ ‘నీకు నాకు డాష్ డాష్’ తో పరిచయమై, ‘ప్రేమ కథా చిత్రంతో’ సూపర్ పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె చివరగా నటించిన ‘శంకరాభరణం, సావిత్రి’ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో, ఆఫర్లు కాస్త తగ్గి పరిశ్రమలో ఈ మధ్య ఆమె హడావుడి పెద్దగా కనిపించలేదు.

దాంతో కొన్ని రోజుల క్రితం నందిత ప్రస్తుతం సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిగా లేదంటూ వార్తలొచ్చాయి. ఈ వార్తలతో షాక్ కు గురైన నందిత ఇలాంటి రూమర్లు కెరీర్ కే ప్రమాదమని భావించి ట్విట్టర్ ద్వారా పేర్కొంది. ‘ఎవరో నేను సినిమాలు చేయడానికి ఆసక్తిగా లేనని వార్తలు పుట్టించారు. అవన్నీ నిజమైనవి కావు. వాటిని నమ్మొద్దు. నేను సినిమాలు చేయడానికి ఎప్పుడూ సిద్దంగానే ఉంటాను’ అంటూ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.