‘శాతకర్ణి’కి రోహిత్ కితాబు..!

85

బాల‌కృష్ణ న‌టించిన ‘గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి’లో నంద‌మూరి వంశీయులు న‌టించాల్సి ఉంది. కొంద‌రు ప్ర‌తిష్టాత‌మ్మ‌క సినిమా క‌నుక అందులో న‌టిస్తామ‌ని అడిగారు. కానీ ఎవ‌రెవ‌రు వున్నార‌నేది పెద్ద‌గా తెలీదు. అయితే  ఇందులో పెద్ద‌గా నంద‌మూరి వంశీయులు లేర‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నాడు. కానీ.. నారారోహిత్ ఇందులో ఓ పాత్ర వేయాల్సింది. ఆ పాత్ర క‌న్న‌డ రాజ్‌కుమార్ త‌న‌యుడు పునీత్ కుమార్‌కు ద‌క్కింది. ముందుగా రోహిత్‌ను అనుకున్నారు. కానీ పాత్ర‌లోని ఔచిత్యం దెబ్బ తింటుంద‌ని ప‌లువురు సూచించ‌డంతో బాల‌కృష్ణ మ‌న‌సు మార్చుకున్నారు.

అదెలాగంటే.. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ రాజ్యం విస్తార‌మైంది. క‌న్న‌డ రాష్ర్టం కూడా తెలుగులోనిదే. అక్క‌డి నాయ‌కుడు పాత్ర ఒక‌టే చేయాలి. దానికి వ‌చ్చీ రాని తెలుగులో మాట్లాడాలి.. అందుకు స‌రైన న‌టుడు పేరున్న వ్య‌క్తి పునీత్ క‌నుక‌.. మార్కెట్ ప‌రంగా దాన్ని మ‌రింత వ‌న్నె తెచ్చేందుకు పునీత్‌ను ఎన్నుకున్న‌ట్లు తెలిసింది. అయితే ఈ విష‌యాన్ని నారారోహిత్ లైట్‌గా తీసుకున్నారు.

సినిమాకు కొన్ని లెక్క‌లుంటాయి. వాటిన‌నుస‌రించే ఆ పాత్ర త‌న‌కు ద‌క్క‌లేద‌నీ, త‌న‌కు ఆ పాత్ర రాలేద‌నే బాధ లేద‌ని చెప్పాడు. అయితే.. ఎవ్వ‌రికీ ద‌క్క‌ని ఓ అవ‌కాశం నాకు ద‌క్కింది. ఈ సినిమాను చాలా వ‌ర‌కు చూసే అవ‌కాశం క‌ల్గింది. చాలా బాగుంది. వార్ ఎపిసోడ్ అద్భుతంగా వుంద‌ని పేర్కొన్నాడు.