సంక్రాంతికి ‘కాట‌మ‌రాయుడు’ టీజ‌ర్

145

ఈ సంక్రాంతికి సినీ ప్రియుల క‌డుపు నిండిపోనుంది. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మ‌రోవైపు నంద‌మూరి బాల‌కృష్ణ‌ వందో సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. ‘శ‌త‌మానం భ‌వ‌తి’ లాంటి మాంచి ఫ్యామిలీఎంట‌ర్ టైన‌ర్ కూడా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతోంది. వీటికి తోడు ఈ ఏడాది రాబోతున్న ప్రెస్టీజియ‌స్ మూవీకి సంబంధించిన టీజ‌ర్ కూడా సంక్రాంతి సంద‌ర్భంగానే సంద‌డి చేయ‌బోతోంది. ఆ సినిమా మ‌రేదో కాదు.. పవన్ ‘కాట‌మ‌రాయుడు’. ఈ నెల 14న సంక్రాంతి కానుక‌గా ‘కాట‌మ‌రాయుడు’ టీజ‌ర్ లాంచ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.

14న సాయంత్రం 7గంట‌ల‌కు కాట‌మ‌రాయుడు టీజ‌ర్ రిలీజ్ చేస్తార‌ట‌. నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా ప‌ది రోజుల కింద‌ట ఒక రోజు త‌ర్వాత ఒక‌టి నాలుగు పోస్ట‌ర్ల‌ను ‘కాట‌మ‌రాయుడు’ టీం రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్ట‌ర్ల విష‌యంలో కొంచెం మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. మ‌రి టీజ‌ర్ విష‌యంలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్లోని గోల్కొండ‌లో ‘కాట‌మ‌రాయుడు’ షెడ్యూల్ జ‌రుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అన్న‌య్య సినిమా ‘ఖైదీ నెంబ‌ర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్ కు కూడా వెళ్ల‌కుండా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ నెలాఖ‌రులోపు సినిమా పూర్తి చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. మార్చిలో ఉగాది కానుక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకుకొస్తుంది.