ప్రిన్స్ మూవీలో ఇంట‌ర్వ‌ల్ అదిరిపోతుందట‌!

187

టాలీవుడ్‌లో రికార్డులు తిర‌గ‌రాసిన క‌థానాయ‌కుడు ప్రిన్స్ మ‌హేశ్‌బాబు, ‘గ‌జిని, తుపాకీ, క‌త్తి’ వంటి సంచ‌ల‌నాలు డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ సొంతం. మ‌రి వీరిద్ద‌రి క‌ల‌బోత‌లో సినిమా వ‌స్తోందంటేనే సంచ‌ల‌నం. ప్ర‌స్తుతం వారిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌స్తున్న చిత్రం ఇప్ప‌టికే దాదాపు 60 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకొంద‌ట‌. ఫిబ్ర‌వ‌రిక‌ల్లా షూటింగ్ పూర్తి చేసి, మేలో సినిమాను విడుద‌ల చేసేందుకు సినిమా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ని టాక్‌. అయితే.. ఒక పోర్ష‌న్ మాత్రం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంద‌ని చిత్ర యూనిట్‌కు అత్యంత స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇంట‌ర్వ‌ల్‌కు ముందు వ‌చ్చే 20 నిముషాలే హైలెట్ అవుతుంద‌ని అంటున్నారు. చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడి దిమ్మ‌తిరిగేలా ఆ స‌న్నివేశాలుంటాయ‌ని టాక్‌.

క‌థానాయ‌కుడును ఓ రేంజ్‌లో చూపించే ఆ సీన్ సినిమాను ఒక ఎత్తులో నిల‌బెడుతుంద‌ని చెప్పారు. త‌న టేకింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే మురుగ‌దాస్‌.. ‘గ‌జిని, తుపాకీ’ వంటి సినిమాల్లో ఇంట‌ర్వ‌ల్ సీన్ల‌ను ఎలా ఎలివేట్ చేశారో తెలిసిందే. మ‌హేశ్ సినిమా కూడా వాటికి ఏ మాత్రం తీసిపోద‌ని చెబుతున్నారు. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.150 కోట్ల దాకా చేస్తుందని అంచ‌నా. త‌మిళ్ వెర్ష‌న్‌, శాటిటైల్ హ‌క్కుల‌ను క‌లుపుకొంటే ఆ మాత్రం మార్క‌ను దాటుతుంద‌ని చెబుతున్నారు.