మూడు సినిమాలపై ఫోకస్..

85

‘మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళిపోతా’ అంటూ స్పీడ్ పెంచేసారు సూపర్ స్టార్. తన కెరీర్ లో ఇప్పటి వరకూ ఓ సినిమా సెట్స్ పై ఉండగా కేవలం నెక్స్ట్ సినిమా గురించి మాత్రమే ఆలోచించే మహేష్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టేసి జెట్ స్పీడ్ లో దూసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.

ప్రెజెంట్ తన 23వ సినిమాను మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న ప్రిన్స్ ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూడు సినిమాల పై ఫోకస్ పెట్టారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివతో సెట్స్ పై వెళ్ళబోతున్న మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లి తో ఇదే ఏడాది లో మరో సినిమాను సెట్స్ మీద పెట్టబోతున్నారు. ఈ ఇద్దరి దర్శకుల సినిమాలతో పాటు తన 26వ సినిమాను త్రివిక్రమ్ తో ప్లాన్ చేసుకున్న ప్రిన్స్ ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ లో లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇలా ఏకంగా మూడు సినిమాలను అనౌన్స్ చేసి లైన్ లో పెట్టిన మహేష్ ఈ మూడు సినిమాల తర్వాతే మిగతా దర్శకులతో ఫిక్స్ అవుతారట.