రాజ‌మౌళి సినిమాను కాదందా?

148

కెరీర్ ఆరంభం నుంచి అప‌జ‌య‌మే ఎరుగ‌ని ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌రాజ‌మౌళి. ఆయ‌న స్టామినా ఏంటో ‘సింహాద్రి’ స‌మ‌యానికే అంద‌రికీ తెలిసిందే. అప్ప‌ట్నుంచి రాజ‌మౌళి సినిమాలో న‌టించ‌డానికి అంద‌రూ త‌హ‌త‌హ‌లాడిపోయిన వారే. ఐతే రాజ‌మౌళి ‘మ‌గ‌ధీర’ లాంటి సినిమాలో న‌టించ‌మ‌ని ఆఫ‌ర్ ఇస్తే ఓ క‌థానాయిక‌నో చెప్పేసింద‌ట‌. అది త‌న జీవితంలో చేసిన అతి పెద్ద పొర‌బాట‌ని.. అందుకు ఇప్పుడు చింతిస్తున్నాన‌ని అంటోంది. ఆ క‌థానాయిక‌. ఆమె మ‌రెవ‌రో కాదు.. తెలుగ‌మ్మాయి అర్చ‌న‌. ‘మ‌గ‌ధీర’ సినిమాలో స‌లోని చేసిన పాత్ర‌ను ముందు అర్చ‌న‌కే ఆఫ‌ర్ చేశాడ‌ట రాజ‌మౌళి చిన్న పాత్రే అయిన‌ప్ప‌టికీ రాజ‌మౌళి సినిమాలో న‌టించ‌డం స్పెష‌ల్ అని.. కానీ తాను ఆ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించాన‌ని అర్చ‌న తెలిపింది.

ఐతే తాను నో చెప్ప‌డానికి కార‌ణం లేక‌పోలేదు అంటోంది అర్చ‌న‌. కెరీర్ ఆరంభంలో క‌థానాయిక‌గా కొన‌సాగుతున్న‌ప్పుడు నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చేశాను. అందులో క‌ళ్ల‌జోడు పెట్టుకుని డీ గ్ల‌మ‌రైజ్డ్ గా క‌నిపిస్తాను. ఆ పాత్ర‌ను బ‌ల‌వంతం మీద చేయాల్సి వ‌చ్చింది. ఆ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌న్నాళ్లూ ఇది ఎందుకు చేస్తున్నానో అని ఏడుస్తూనే ఉండేదాన్ని. ఆ సినిమా చేయ‌డం వ‌ల్ల నా కెరీర్ దెబ్బ తింది. క‌థానాయిక‌గా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.

‘ఖ‌లేజ‌’లో కూడా ఇలాంటి ప్రాధాన్యం లేని పాత్రే చేశా. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అనుభ‌వం త‌ర్వాత ఇలాంటి పాత్ర‌లు చేయ‌కూడ‌ద‌నుకుని రాజ‌మౌళి ‘మ‌గ‌ధీర‌’లో అవ‌కాశం ఇచ్చినా నో చెప్పాను. ఐతే ఆ సినిమాలో నేను చేయాల్సిన పాత్ర‌లో న‌టించిన సలోని త‌ర్వాత ‘మ‌ర్యాద‌రామ‌న్న‌’లో అవ‌కాశం ద‌క్కించుకుంది. నేను ‘మ‌గ‌ధీర’ చేసి ఉంటే ‘మ‌ర్య‌దరామ‌న్న ‘ కూడా చేసేదాన్నేమో అప్పుడు నా కెరీర్ ఇంకోలా ఉండేది. ఈ విష‌యంలో రాజ‌మౌళికి ఫోన్ చేసి సారీ చెప్పాల‌నుకున్నాను అని అర్చ‌న తెలిపింది.