చెర్రీ హెయిర్ స్టైల్ అదుర్స్‌

80

మెగాస్టార్ మెగా మూవీ ‘ఖైదీ నంబ‌ర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ ఫంక్ష‌న్‌లో మెగా క‌థానాయ‌కులంతా ఒకేవేదిక మీద సంద‌డి చేయ‌డం అస‌లైన స్పెషాలిటీ అయితే.. ‘ఖైదీ నంబ‌ర్ 150’ నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ కొత్త లుక్ మాత్రం మ‌రింత కొత్త‌గా క‌నిపించింది. సుకుమార్ డైరెక్ష‌న్‌లో త‌న కొత్త సినిమా ఉంటుంద‌ని ఇప్ప‌టికే చెప్పేసిన చెర్రీ ఆ మూవీ కోసం మేకోవ‌ర్ చేస్తున్నాన‌ని కూడా గ‌తంలోనే చె్ప్పేశాడు. అలాగే గెడ్డం లుక్‌తో క‌నిపించ‌బోతున్న‌ట్లు కూడా ఇంత‌కుముందే చెప్పిన చెర్రీ.. ఇప్పుడు ఖైదీ ఫంక్ష‌న్‌లో త‌న లుక్‌ను రివీల్ చేసేసిన‌ట్లే కొత్త హెయిర్ స్టైల్‌.. బాగా పెంచిన గ‌డ్డంతో సూప‌ర్బ్ లుక్‌తో హ్యాండ్స‌మ్ లుక్‌తో అద‌ర‌గొట్టేశాడు చ‌ర‌ణ్‌

మ‌ధ్య‌పాపిడి తీస్తూ పెద్ద గ‌డ్డంతో చ‌ర‌ణ్‌ను చూస్తుంటే.. లుక్ భ‌లేగా ఆక‌ట్టుకోవ‌డం ఖాయం. మెగా స్టార్ మెగా మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం కొన్ని రోజులు కేటాయించ‌బోతున్నాడు చెర్రీ. ఆ త‌ర్వాత నుంచి సుకుమార్ సినిమా ప‌నులు మొద‌లు పెట్టేయ‌మ‌న్నాడు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు క్యాస్టింగ్‌తో పాటు ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసేస్తున్నాడులే..