రానా సినిమాకు ఎన్టీఆర్ వాయిస్‌..!

88

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇంత‌కుముందు త‌న అన్న‌య్య నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కోసం ఒక‌సారి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. అంతే త‌ప్ప బ‌య‌టి క‌థానాయ‌కులెవ్వ‌రికోసం మాట సాయం చేయ‌లేదు. తొలిసారి తార‌క్ ఆ ప‌ని చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ద‌గ్గుబాటి రానా కెరీర్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఘాజీ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌బోతున్నారని తెలిసింది. పీవీపీ సినిమా తెర‌కెక్కిస్తున్న ఘాజి హిందీ.. తెలుగు.. త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కింది. హిందీలో ఈ చిత్రానికి లెజండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నారు. తెలుగు వెర్ష‌న్ కోసం ఎన్టీఆర్‌ను సంప్ర‌దించ‌గా అత‌ను ఓకే అన్న‌ట్లు స‌మాచారం.

ఈ త‌రం క‌థానాయ‌కుల్లో డిక్ష‌న్ విష‌యానికి వ‌స్తే ఎన్టీఆర్ త‌ర్వాత ఎవ‌రైనా కాబ‌ట్టి ఘాజీ లాంటి ప్రెస్టీజియ‌స్ మూవీకి అత‌ను వాయిస్ ఇస్తే సినిమాకు మ‌రింత వెయిట్ వ‌స్తుంద‌ని భావించి అత‌ణ్ని సంప్ర‌దించార‌ట‌. ఎన్టీఆర్ కూడా అభ్యంత‌ర పెట్ట‌కుండా ఒప్పుకున్నారు. త‌మిళ వెర్ష‌న్ కోసం సూర్య లేదా ఇంకెవ‌రైనా ప్ర‌ముఖ న‌టుడితో వాయిస్ ఇప్పించాల‌ని ట్రై చేస్తున్నారు పీవీపీ. ఇండియాలో తెర‌కెక్కుతున్న తొలి స‌బ్ మెరైన్ వార్ మూవీ ఘాజీ.1971 నాటి ఇండియా పాకిస్థాన్ యుద్ధం నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంది. అప్ప‌టి ప‌రిస్థితుల పై ఓ పుస్త‌కం రాసిన సంక‌ల్ప్ రెడ్డి అనే కుర్రాడే ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్ర‌వ‌రిలో 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. రానాతో పాటు ఓంపురి.. తాప్సీ ఇందులో కీల‌క పాత్ర‌లు పోషించారు.