పవర్ ఫుల్ జోగేంద్రగా రానా..!

46

మొన్నటి వరకూ ‘బాహుబలి-2’ షూటింగ్ లో బిజీ గా ఉన్న రానా ఆ సినిమాలో తన క్యారెక్టర్ కి సంబంధించిన షూట్ ఫినిష్ చేసేసి నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టేసాడు. తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో జోగేంద్ర అనే పొలిటికల్ క్యారెక్టర్ లో నటిస్తున్న రానా ఈ సినిమాను వీలైనంత స్పీడ్ గా పూర్తి చేయాలని చూస్తున్నాడు.

ప్రస్తుతం అనంతపురం లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రానా సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంతో మళ్ళీ పూర్వ వైభవం అందుకోవాలని చూస్తున్నాడు డైరెక్టర్ తేజ. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ చూస్తుంటే రానా మొదటి సినిమా ‘లీడర్’ ని తలపిస్తోంది. త్వరలో చిత్రీకరణ పూర్తిచేసి, సినిమాని సమ్మర్ లో విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్, ఆడియోకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.