‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సీక్వెల్..?

77

బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని ఓ వైపు ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంటే, మరో వైపు ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా సీక్వెల్ గురించి ఆలోచించడం కూడా మొదలుపెట్టేశాడు.

‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ హైలెట్ అయితే, ఈ సినిమా సీక్వెల్ లో వశిష్టిపుత్రుడు పులుమావి కథ ఆధారంగా సీక్వెల్ ఉంటుందని చెప్పాడు క్రిష్. ఏది ఏమైనా ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి తీసుకు వస్తాడో కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కానీ, తన డ్రీం ప్రాజెక్ట్ ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఫుల్ జోష్ లో ఉన్నాడు క్రిష్ .