పృథ్వీ సీన్స్ జతచేశాం..!

157

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ‘ఖైదీ నంబ‌ర్ 150’వ చిత్రంలో తాను న‌టించిన కొన్ని  స‌న్నివేశాల‌ను తొల‌గించ‌డంపై హాస్య న‌టుడు, థ‌ర్టీ ఇయ‌ర్స్‌ ఇండ‌స్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్య‌లు ఇటు చిత్ర క‌థానాయ‌కుడు చిరంజీవితో పాటు. ద‌ర్శ‌కుడు వివి వినాయ‌క్‌ను బాధించాయి. ‘ఖైదీ’ మూవీనుంచి తాను న‌టించిన స‌న్నివేశాలు తొల‌గించ‌డంపై పృథ్వీ స్పందిస్తూ సంక్రాంతి రోజు క‌న్న త‌ల్లి చ‌నిపోయినంత బాధ‌గా ఉందంటూ వాపోయిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలు చిత్ర ద‌ర్శ‌కుడు వివి వినాయ‌క్ ను బాదించడంతో ఆయన వివ‌ర‌ణ ఇచ్చారు. ‘ఆ స‌న్నివేశాల్ని తొల‌గిస్తున్న‌ట్టు పృధ్వీకి ఫోన్ చేసి చెప్పాన‌ని.. త‌ర్వాత ఆయ‌న చేసిన త‌ల్లి చ‌నిపోయినంత బాధ‌గా ఉంద‌నే కామెంట్లు విని తాను చాలా ఫీల‌వ‌య్యాన‌న్నారు. ఇదే విష‌యాన్ని ప‌త్రిక‌ల్లో చూసిన చిరంజీవి కూడా చాలా ఫీల‌య్యార‌ని వినాయ‌క్ చెప్పారు. వెంట‌నే చిరంజీవి త‌న‌కు ఫోన్ చేసి పండ‌గ‌రోజు ఒక‌ర్ని బాధ‌పెట్ట‌డం ఎందుకు కేవ‌లం న‌ల‌భై నిమిషాల సీనే క‌దా. అదుంటే పోయేదేముంది మ‌హా అయితే ఇంకాస్త న‌వ్వుకుంటాం క‌దా అన్నార‌ని, దీంతో తీసిన బిట్‌ను మ‌ళ్లీ సినిమాలో జ‌త‌చేసిన‌ట్టు ద‌ర్శ‌కుడు వెల్ల‌డించారు’.