ఆ ఇద్దరిపై వినాయక్ కామెంట్స్

283

మ‌రో జ‌న్మంటూ ఉంటే జ‌గ‌న్‌లా పుట్టాల‌ని ఉంద‌ని ‘ఖైదీ నంబ‌ర్‌ 150’వ చిత్ర ద‌ర్శ‌కుడు వి.వినాయ‌క్ త‌న మ‌న‌సులో మాట‌ను వెల్ల‌డించారు. జ‌గ‌న్ అంటే వైఎస్ ఆర్‌ సీపీఅధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కాదండీబాబూ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌. అక్కినేని అఖిల్‌తో నిర్మించిన అఖిల్ చిత్రం భారీ డిజాస్ట‌ర్‌తో వినాయ‌క్ చాలాఇబ్బందిప‌డ్డారు. కానీ, ఇప్పుడు మెగాస్ట‌ర్ చిరంజీవితో 150వ సినిమా ఖైదీ నంబ‌ర్ 150తో టాక్‌ ఆఫ్ ది ఇండ‌స్ర్టీగా మారిపోయాడు. మెగా అభిమానుల‌తో పాటు ఎంతోమంది సినీ జ‌నాలు వినాయ‌క్ సినిమా పై ఎన్నో ఆశ‌లు, అంచ‌నాలు పెట్టుకున్నారు. ఖైదీ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ఆయ‌న తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇందులో త‌న‌తో పాటే సినీ కెరీర్ ప్రారంభించిన మ‌రో ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌తో త‌న‌కున్న అనుబంధాన్ని చ‌నువును వెల్ల‌డించాడు.

ఆ ఇద్ద‌రూ ద‌ర్శ‌కులు మ‌రెవ‌రో కాదు. బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఎవ‌రెస్టుకు ఎక్కించిన ద‌ర్శ‌క‌ధీరుడుఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, ఆరు నెల‌ల్లోనే అద్భుత‌మైనసినిమా తీసిప‌డేసే పూరీజ‌గ‌న్నాథ్‌. ఈ ఇద్ద‌రి గురించి వినాయ‌క్ ఏం చెప్పార‌నేది ఆయ‌న మాట్లోల‌నే..మేం ముగ్గురం చాలా బాగుంటాం. రాజ‌మౌళితో నేను క‌ల‌వ‌డం ఫ్యామిలీగ్యాదెరింగ్‌లా ఉంటుంది. స‌ర‌దాగా ఉంటాం. రాజ‌మౌళికి కానీ, కీర‌వాణికి కాని నేనంటే చాలా ఇష్టం. రాజ‌మౌళి కొంచెం కూల్‌. కానీ జ‌గ‌న్ అలా కాదు. అస‌లు భ‌యం కానీ, కేర్ కానీ ఏమీ ఉండ‌దు. మ‌ళ్లీ జ‌న్మంటూ ఉంటే జ‌గ‌న్‌లా పుట్టాలి అని మ‌న‌సులోని మాట‌ను వెల్ల‌డించారు.