డ్రంక్ అండ్ డ్రైవ్.. పోలీసులకు చుక్కలు చూపించిన యువతి

129

మద్యం తాగి కారు నడుపుతున్న ఓయువతి హైదరాబాద్ పోలీసులకు చుక్కలు చూపించింది. బంజారాహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులను గమనించిన ఆ యువతి వేగంగా వెళ్లే ప్రయత్నంలో ఓ కారును, కొన్ని బైకులను ఢీకొట్టింది. కొందరు వాహనదారులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించగా, దుర్భాషలాడుతూ వేగంగా వెళ్లిపోయింది. పోలీసులు ఆపడానికి ప్రయత్నించి ఆమెను వెంబడించి చివరకు ఎల్వీ ప్రసాద్ ల్యాబ్స్ వరకూ చేజ్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఆమె కారును ఆపి … కారులో ఉన్న  ఆమె స్నేహితురాలిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ఆమె పోలీసులను ఇబ్బంది పెట్టింది. చివరికి మహిళా పోలీసుల సహాయంతో ఆమెను అరెస్ట్ చేశారు. నిందితురాలు  ఓ ప్రైవేటు యూనివర్శిటీలో బీబీఏ చదువుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.