ప్లాస్టిక్ పరిశ్రమలో చెలరేగిన మంటలు

88

రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. మైలార్ దేవ్ పల్లి కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పొగలు దట్టంగా కమ్ముకోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది.