హైదరాబాద్ కు మరో మెగా ప్రాజెక్టు

90

హైదరాబాద్ నగరానికి మరో మెగా ప్రాజెక్టు రానుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో సోమవారం జరిగిన 2017 విఎల్ఎస్ఐడీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే హైదరాబాద్ లో విఎల్ఎస్ఐ డిజైనింగ్ అకాడమీతో ఎందరో యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఐటీ రంగంలో హైదరాబాద్ అనూహ్య ఫలితాలు సాధిస్తోందని ఆయన తెలిపారు. దేశ జనాభాలో 65 శాతం 35 ఏళ్ల లోపు వారేనని, దేశ పురోభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన చెప్పారు.