మెగా ఫ్యాన్స్‌ కి సంక్రాంతి!

231

‘ఖైదీ’ కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు. “మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి మొదలయింది” అని మ్యూజిక్ డైరెక్టర్‌ ఎస్.ఎస్.తమన్ ఒక ట్వీట్ చేశాడు. మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం అమెరికాలో ప్రీమియర్‌ షోల సమయానికే  మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయని అక్కడి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. వాటినే దర్శకుడు హరీష్‌ శంకర్, కమెడియన్ వెన్నెల కిశోర్‌ రీ-ట్వీట్‌ చేశారు. ప్రీమియర్ షో గ్రాస్ కలెక్షన్లలో ఇప్పటివరకు ‘బాహుబలి ‘ టాప్. ఆ రికార్డుని ‘ఖైదీ నెం-150’ దాటేస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.

చిరంజీవి 150వ చిత్రం కావడం ఒక విశెషమైతే, దాదాపు 10 ఏళ్ల తర్వాత వచ్చిన చిత్రం కావడం మరో విశేషం.  ఈ సినిమా అవలీలగా 100 కోట్ల రూ.లను మించి వసూళ్లు సాధిస్తుందని సినీ వర్గాలు లెక్కలేస్తున్నాయి. చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’ బుధవారం విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు చెబుతున్నాయి.

“ఖైదీ నంబర్‌ 150 సూపర్‌ హిట్ అమ్మా.. బాస్‌ ఈస్‌ బాక్ ట్యాగ్ లైనుకు మెగాస్టార్ పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్, డాన్స్, టైమింగ్ అన్నీ కుదిరాయి. మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి మొదలయింది” అని చిరు అభిమాని చేసిన ట్వీట్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్ రీ-ట్వీట్ చేశాడు. ‘ఖైదీ నంబర్‌ 150’ పెద్ద హిట్ కాబోతుందని పేర్కొంటూ హీరోయిన్ కాజల్ పొంగిపోతోంది. ధియేటర్‌ దగ్గర అభిమానులు సందడి చేస్తున్న ఫొటోని పెట్టింది.