13 వరకూ నో ప్రాబ్లం..

80

నేటి నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు అనుమతించకూడదన్న నిర్ణయంపై పెట్రోల్ బంక్ డీలర్లు వెనక్కి తగ్గారు. బ్యాంకులు సర్వీసు చార్జీలు వసూలు చేయనున్నాయన్న ఆందోళనతో డీలర్లు ఇకపై కార్డులను అనుమతించకూడదని ముందుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులతో జరిపే లావాదేవీలపై ఒక శాతం సర్వీసు ఛార్జీలు వసూలు చేయాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఈ నిర్ణయంపై పెట్రోల్ బంకు డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రెడిట్, డెబిట్ కార్డులపై పెట్రోల్, డీజిల్ అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయించారు. అయితే కేంద్ర ప్రభుత్వ సూచనతో సర్వీసు చార్జీల వసూలుపై బ్యాంకులు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. చార్జీల వసూలును 13 వరకు వాయిదా వేశాయి. దీంతో  పెట్రో డీలర్లు కూడా కార్డుల వినియోగంపై 13 వరకు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు.