బడ్జెట్ పై కేంద్రానికి ఈసీ లేఖ

77

 ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ను వాయిదా వేయాలన్న విపక్షాల డిమాండ్‌పై ఎన్నికల సంఘం స్పందించింది. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్డ్ ప్రకటించింది. అయితే నోటిఫికేషన్ ను పరిగణలోకి తీసుకోకుండా ముందుగా అనుకున్నట్లే ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ ప్రవేశపెట్టేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందే బ‌డ్జెట్ నిర్వ‌హిస్తే, ప్ర‌భుత్వం ఓట‌ర్ల‌ను ఆకర్షించేందుకు ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉంటాయని ఆరోపిస్తున్న ప్ర‌తిప‌క్షాలు.. మార్చి 8న బడ్జెట్‌ ప్రవేశపెట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని ఈసీని అభ్యర్ధించాయి. ఈ విష‌యంపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. విప‌క్షాలు తెలుపుతున్న అభ్యంత‌రాల‌పై ప్రాథమిక చర్యగా కేంద్ర ప్ర‌భుత్వం స్పందన తెల‌పాల‌ని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి ఓ లేఖ‌ రాసింది.  కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనపై ప్రతిపక్షాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.