ఫీజు రీఎంబర్స్ మెంట్ పై అఖిలపక్షం

96

విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై రెండో రోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. పెండింగ్‌లో ఉన్న పీజు బకాయిలను మార్చి 31లోపు చెల్లిస్తామని ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ చెప్పారు. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను చెల్లించడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు సభలో వివరించారు. ఈ పథకం అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ పథకం అమలుకు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నయని అట్టి  లోపాలను సరిదిద్దేందుకు ఈ విషయంపై  త్వరలోనే ఆల్‌పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు.  బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఫీజులు చెల్లించనందువల్ల విద్యాసంవత్సరం ముగిసినా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి .. ఇకపై ఈవిధమైన  ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.