పవిత్రం ముక్కోటి దర్శనం!

163

హిందూ ధర్మానుసారంగా ఆదివారంనాటి ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనది. శ్రీ మహా విష్ణువు నివసించే వైకుంఠ ద్వారం ఈ ఏకాదశినాడు తెరచుకుంటుందని ప్రతీతి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయన్న నమ్మకంతో… వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థంకోసం వేచి ఉన్నారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. గీతోపదేశం జరిగిన రోజు కనుక ‘భగవద్గీత’ పుస్తకదానం చేస్తారు.

ఈ రోజున దేశమ్ళోనే కాక, విడేశాల్లోని అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. ఈ ఒక్కరోజున భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. తిరువతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచారు.

తిరుమలలో తరిస్తున్న భక్త కోటి

తిరుమల పుణ్యక్షేత్రంలో తెల్లవారు జామున 1.30 గంటలకే వి్ఐపి దర్శనాలతో స్వామివారిని మేలుకొలిపారు. వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠ ద్వారాన్ని తెరచి వుంచుతారు. ఈ రెండు రోజులూ భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.

టిటిడి ప్రత్యేక ఏర్పాట్లతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త వహిస్తోంది. టిటిడి బోర్డ్ చైర్మన్ సిహెచ్. చలపతిరావు, ఈవో సాంబశివరావు దగ్గరుండి పర్యవేక్షణ సాగిస్తున్నారు. మొత్తం 16 కంపార్టుమెంట్లలోనూ భక్తులు నిండిపోయి ఉన్నారు. వారికి పాలు, ఫలహారం సమయానికి అందజేస్తున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు తిరుమలలో వేకువజామునే శ్రీవారిని దర్శించుకుని ఆశీసులు అందుకున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, ఎమ్మెల్యే డి.కె.అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సినీ నటుడు మోహన్ బాబు తదితరులు కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు.