‘కోదండ’పై స్టూడెంట్స్ ఫైర్

138

జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై విరుచుకుపడ్డారు. కోదండరాం తెలంగాణ అభివృద్ధికి, ప్రాజెక్టులకు అడ్డు పడుతున్నారని వారు మండిపడ్డారు. సోమవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్యర్యంలో విద్యార్థులు తార్నాకలోని కోదండరాం ఇంటిని ముట్టడించారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహోరాత్రాలూ పాటు పడుతుంటే..కోదండరాం ఆయనకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా కోదండరాం తెలంగాణ వ్యతిరేక వైఖరి విడనాడాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు జేఏసీ నేతలను అరెస్టు చేశారు. విద్యార్థులను అక్కడి నుంచి చెదరగొట్టారు.