జబర్దస్తు నవ్వు!

211

“ఈ విషయం విన్నావా..?”

“ఏ విషయం..?”

“నాగ్బాబుకి నెలకు యెనిమిది నుండి పదిలక్షలదాక యిస్తారట..!”

“దేనికి? జబర్దస్తు ప్రోగ్రాముకా..?”

“ఆ!, రోజాకు కూడా అంతేనట..!”

“అందుకే ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని వదిలేసి మరీ నవ్వుతోంది..!”

“ఆవిధంగా తన నియోజక వర్గానికే కాదు, అన్ని నియోజక వర్గాలకు తన సేవలు అందిస్తోంది..!”

“అయినా అంతేసి రెమ్యూనిరేషన్లు..”

“అందులో వింతేముంది..?”

“జబర్దస్తు జడ్జీలుగా వీళ్ళు చేసేదేముంది? హిహిహి.. అని పల్లికిలించడం తప్ప..”

“నవ్వుతున్నారు కదా..?”

“నవ్వితే అన్ని లక్షలు యిచ్చేస్తారా..?”

“అయినదానికీ కానిదానికి నవ్వడం అంత ఈజీ కాదు..!”

“అవున్లే నవ్వు రాకపోయినా నవ్వగలగాలి కదా..?”

“అంతేకాదు, బూతుజోకులకు సిగ్గు పడకుండా పడిపడి దొర్లిదొర్లి నవ్వడం మామూలు విషయమా..?”

“కాదనుకో..”

“పరమచెత్త జోకులకి కుల్లు జోకులకి కూడా బాగుంది.. చాలా బాగుంది అని కాంప్లిమెంట్స్ యిచ్చి మెచ్చుకోవడం..!”

“నార్మల్ విషయం కాదనుకో..”

“ఏడుపోస్తుంటే కూడా నవ్వడం..”

“కష్టమే అనుకో..”

“ప్రేక్షకులు చూస్తారని మర్చిపోయి బూతుని నబూతో.. నభవిష్యత్తు అని అంటున్నారంటే..”

“లేదు.. నేనే అర్థం చేసుకోలేదు, వాళ్లకి యెంత యిచ్చినా తక్కువే..!”

                                                          -బమ్మిడి జగదీశ్వరరావు