ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

182

కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. స్థానిక ట్రిపుల్‌ ఐటీ హాస్టల్‌లో ఉంటున్న స‌ద‌రు విద్యార్థిని వీణ తన గదిలో ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది. ఎంత‌కీ త‌లుపులు తెర‌వ‌కపోవ‌డంతో అనుమానం వ‌చ్చిన తోటి విద్యార్థినులు కిటికీ నుంచి చూసి, వెంట‌నే త‌మ కాలేజీ యాజమాన్యానికి చెప్పారు. వారు పోలీసులకు స‌మాచారం అందించ‌డంతో అక్క‌డికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి తర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు.