2 వేల నోటు డిజైన్ తో శారీ

85

 కొత్త 2 వేల నోట్ల డిజైన్‌తో ఓ బట్టల వ్యాపారి చీరలు తయారు చేశాడు. పింక్ కలర్‌లో తయారు చేసిన ఈ చీరలు మహిళలను ఆకట్టుకుంటున్నాయి. కొత్త లుక్ కోసమే 2 వేల నోట్ల మాదిరి చీరలను డిజైన్ చేశామని బట్టల వ్యాపారులు తెలిపారు. ఆరు మీటర్ల పొడవున్న ఈ చీరలో 504 నోట్లు వచ్చేలా తయారు చేశామని తెలిపారు. అమ్మకాలు బాగున్నాయని పేర్కొన్నారు. ఈ చీర ఖరీదు మాత్రం రూ. 160 మాత్రమే. శాసనసభ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో ఈ చీరలకు భలే గిరాకీ ఉందని తెలుస్తోంది.