ప్రకటనల్లో నేతల ఫోటోలు ఉండకూడదు

18

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా భారత ఎన్నికల సంఘం మరో కీలక ఆదేశాన్ని ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదు రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్న హోర్డింగులు, పోస్టర్లలో నేతలు ఫోటోలను తీసివేయాలని రాష్ట్రాలు, జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు పంపింది. ఐదు రాష్ట్రాల పరిధిలోనే ఈ నిర్ణయాలు అమలవుతాయని, మీడియాకు ఇచ్చే ప్రకటనల్లో సైతం రాజకీయ నేతల ఫోటోలు ఉండరాదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజకీయ నేతలను హెచ్చరించింది.