కళాకారులకు గుర్తింపు కార్డులివ్వాలి..

57

తెలంగాణలోని వృత్తి కళాకారులకు గుర్తింపు కార్డులు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, భూమి మంజూరు చేయాలని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ సాంస్కృతిక సారథి పేరిట 550 మందికి మాత్రమే వేతనాలిస్తున్నారని, రాష్ట్రంలోని వేలాది కళాకారులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.  50 ఏళ్లు దాటిన కళాకారులకు రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఎన్నికల హామీల్లో టీఆర్‌ఎస్‌ పేర్కొన్న విధంగా ప్రతీ కళకు సంబంధించి శిక్షణ, ప్రదర్శన కోసం మండల కేంద్రాల్లో సాంస్కృతిక కేంద్రాలు నిర్మించాలని లేఖలో సూచించారు. గ్రామాల్లో కోలాటం, బాగోతం, డప్పు విన్యాసాలు ప్రదర్శించే కళాకారులకు గుర్తింపు కార్డులివ్వాలని, రవాణాలోనూ రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.