ఆయుష్ వైద్య విధానాన్ని బలోపేతం చేస్తున్నాం

75

తెలంగాణలో  ఆయుష్ వైద్య విధానాన్ని బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.. నిరుపేదలకు ఎలక్ట్రో హోమియోపతి ద్వారా వైద్యం అందించడం హర్షణీయమన్నారు. గత పాలకుల హయాంలో వైద్య రంగం నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రో హోమియో సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామన్నారు. హిస్టరెక్టమీ ఆపరేషన్లను నిలిపివేయాలని కోరారు. అన్ వాంటెడ్ ఆపరేషన్లపట్ల ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని కోరారు.