బాగ్ధాద్ లో ఆత్మాహుతి దాడి

64

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. మార్కెట్ వద్ద నిలిపి ఉంచిన కారు బాంబు పేలిన ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో ఆరుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘనటకు పాల్పడింది తామేనని ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించుకోలేదు. అయితే ఐసిస్ పనే అయి ఉంటుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.