భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ పనులు ఏడాదిలోగా పూర్తి

63

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటిస్తున్నారు. మణుగూరులోని భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌కు త్వరలో పర్యావరణ అనుమతులు మంజూరవుతాయని మంత్రి తెలిపారు. భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ పనులు ఏడాదిలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.   పాల్వంచ కేటీపీఎస్ ను సందర్శించి, పనిచేస్తోన్న తీరును మంత్రి పరిశీలించారు. విద్యుత్‌కు డిమాండ్ మరింత పెరిగినందున.. . మరో రెండున్నరేళ్లలో 26 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని స్పష్టం చేశారు.