బీజేపీ ఎంపీ కు ఈసీ షోకాజ్ నోటీసులు

64

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షిమహారాజ్‌కు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జనవరి 4న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంపై బుధవారం లోపు వివరణ ఇవ్వాలని సాక్షి మహారాజ్‌కు కోర్టు ఆదేశాలు జారీచేసింది. దేశంలో జనాభా పెరిగేందుకు ముస్లింలే కారణమని..నలుగురు భార్యలు, 40 మంది పిల్లలు అన్న కాన్సెప్ట్‌కు మద్దతు తెలిపే వాళ్ల వల్ల జనాభా పెరుగుతుందని బీజేపీ ఎంపీ సాక్షిమహారాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.