క్యాబ్ డ్రైవర్ల దీక్ష భగ్నం

68

ఉబర్ క్యాబ్ డ్రైవర్లు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఓవ‌ర్ టైమ్ డ్యూటీలు సైతం చేయిస్తున్న యాజ‌మాన్యాలు త‌మ‌కు రావాల్సిన పేమెంట్‌ను మాత్రం స‌రిగా ఇవ్వ‌డం లేదంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న ఓలా, ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన బాటపట్టారు. త‌మ‌ డిమాండ్లపై స్పందించాలంటూ హైదరాబాద్ లోని ఈసీఐఎల్‌లో తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్లు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంత‌రం అందులో పాల్గొంటున్న‌ ఓలా క్యాబ్‌ డ్రైవర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు శివను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మ‌రోవైపు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేంత వ‌ర‌కు పోరాడ‌తామ‌ని క్యాబ్ డ్రైవ‌ర్లు అంటున్నారు.