నగదు రహిత విధానాన్ని మేమే ప్రవేశపెట్టాం..

67

ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ అత్యుత్త‌మైన‌ద‌ని మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబ‌రం ఆరోపించారు. న‌గ‌దు ర‌హిత వ్య‌వ‌స్థ గురించి ప్ర‌ధాని మాట్లాడుతున్నార‌ని, గ‌తంలో ఎప్పుడూ అలా జ‌ర‌గన‌ట్లు ఆయ‌న చెబుతున్నార‌ని చిదంబ‌రం విమ‌ర్శించారు. కార్డు ద్వారా డ‌బ్బులు చెల్లించాలన్న విధానాన్ని తామే ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు మాజీ మంత్రి చెప్పారు. నోట్ల ర‌ద్దు అంశంపై క్యాబినెట్ స‌మావేశం జ‌రిగింద‌న్నారు, కానీ దానికి సంబంధించిన రికార్డులు ఏమీ లేవ‌ని, మంత్రుల‌ను ఖైదీలుగా మార్చి ప్రధాని వాళ్లను బంధించార‌ని చిదంబ‌రం విమ‌ర్శించారు. నోట్ల ర‌ద్దు వల్ల జీడీపీపై ప్ర‌భావం ఉండద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ త‌ప్ప ఆ మాట ఎవ‌రూ అన‌డం లేద‌న్నారు. జూన్ లేదా జులై నెల‌లో ఇంజ‌నీరింగ్‌, మెడిసిన్ కాలేజీలు ప్రారంభం అవుతాయ‌ని, ఆ కాలేజీలు క్యాప్టేష‌న్ ఫీజును వసూల్ చేస్తాయ‌ని, దాన్ని మోడీ అడ్డుకోవాల‌ని స‌వాల్ చేశారు.