కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

50

ప‌శ్చిమ‌బెంగాల్‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. 24 ప‌ర‌గ‌ణాల‌ జిల్లాలోని మ‌ధ్యంగ్రామ్‌లోని ఓ ర‌సాయ‌న క‌ర్మాగారంలో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. స‌మాచారం అందుకున్న వెంట‌నే 38 అగ్నిమాప‌క యంత్రాలు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశాయి. ఈ క్ర‌మంలో మంట‌లు ఆర్పుతున్న ముగ్గురు అగ్నిమాప‌క సిబ్బందికి గాయాల‌య్యాయి. బాధితుల‌ను చికిత్స నిమిత్తం స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. భారీగా ఆస్తినష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.