170 మంది బాల కార్మికులకు విముక్తి

74

బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను రూపుమాపేందుకు ప్ర‌భుత్వాల‌తో పాటు ఎన్నో స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఎంతో కృషి చేస్తున్న‌ప్ప‌టికీ ఇంకా ఎంతో మంది చిన్నారులు చ‌దువుకి దూర‌మై వెట్టిచాకిరి చేస్తూనే క‌నిపిస్తున్నారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం మండలంలో 170 మంది చిన్నారులు ఇటుకబట్టీల్లో ప‌నిచేస్తూ క‌నిపించారు. వారంద‌రికీ పోలీసులు విముక్తి క‌ల్పించి వారి సొంత ప్రాంతానికి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ బాల‌ కార్మికులంతా ఒడిశాకు చెందిన పిల్ల‌లుగా పోలీసులు గుర్తించారు. వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్న 18 మంది ఇటుకబ‌ట్టీ నిర్వాహ‌కుల‌పై కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు