ఢిల్లీలో కాల్పుల కలకలం

66


ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన ఘటనలో  నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కాల్పులకు పాత గొడవలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.