ఢిల్లీ ప్రజలకు బంపరాఫర్…

71

ప్రమాదాల బారిన పడిన వారిని చూసిన స్థానికులు ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ప్రమాద బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్తే, రూ. 2 వేలను ప్రోత్సాహకంగా ఇస్తామని తెలిపింది. ప్రజల్లో సేవా దృక్పథాన్ని పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, సాయపడిన వ్యక్తికి ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రాన్ని అందిస్తామని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు. . పోలీసులకు ఫోన్ చేసి చెబితే, ప్రత్యక్ష సాక్షిగా నమోదు చేసి స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతారని, ప్రశ్నలతో వేధిస్తారని ప్రమాదాలు జరిగినప్పుడు బాధితుల బాగోగులను అత్యధికులు పట్టించుకోరు. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు ఢిల్లీ ప్రభుత్వం కదిలింది. తమ నిర్ణయంతో ప్రజల్లో చైతన్యం వస్తుందని భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.