ఢిల్లీలో దట్టంగా పొగమంచు

57

ఢిల్లీని పొగమంచు కప్పేసింది. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో రవాణా వ్యవస్థ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒక అంతర్జాతీయ, ఐదు దేశీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. 11 రైళ్లు రద్దు కాగా, 7 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాహనదారులు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. చలి కూడా అధికమవడంతో ఉత్తరాది ప్రజలు వణికిపోతున్నారు. జమ్మూకశ్మీర్‌లో మంచు దుప్పటి పరుచుకుంది. మంచును తొలగించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.