మద్యం మత్తులో కత్తితో దాడి

65

మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీ కాలనీలో  ఉంటున్న ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య మాటా మాటా పెరిగి  దేవేందర్ అనే వ్యక్తిపై యూసుఫ్‌ కత్తితో దాడి చేశాడు. దీంతో అతనికి ఛాతిపై గాయాలయ్యాయి. క్షతగాత్రుడను  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు యూసుఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.